Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 68

Janaka sends invitation to Dasaratha !!

||om tat sat ||

బాలకాండ
అష్టషష్టితమస్సర్గః

జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాంతవాహనాః |
త్రిరాత్రముషితా మార్గే తే అయోధ్యాయాం ప్రావిశన్ పురీమ్ ||

స|| తే దూతాః జనకేన సమాదిష్టాః మార్గే త్రి రాత్రం ఉషితా క్లాంత వాహనాః తే అయోధ్యాయాం పురీమ్ ప్రావిశన్|

తా|| జనకుని చేత ఆదేశించబడిన ఆదూతలు మూడు దినములు మార్గములో రాత్రులలో అగి అలసట పొందిన వాహనములు కలవారై అయోధ్యానగరము ప్రవేశించితిరి.

రాజ్ఞో భవన మాసాద్య ద్వారస్థాన్ ఇదమబ్రువన్ |
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్ నో జనకస్య చ |
ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయ న్యవేదయన్ ||

స|| (తే) రాజ్ఞః భవనం ఆసాద్య ద్వారస్థాన్ ఇదం అబ్రవీత్ | రాజ్ఞే శీఘ్రం నివేద్యతాం జనకస్య దూతాన్ నో చ| ఇతి ఉక్తా తే ద్వారపాలాః రాఘవాయ న్యవేదయన్ ||

తా|| ఆ రాజుయొక్క భవనమును సమీపించి ఇట్లు పలికిరి. ’రాజునకు శీఘ్రముగా నివేదింపుడు జనకుని దూతలు వచ్చినారు ’ అని. అలా చెప్పబడిన ద్వారపాలకులు రఘుకులవంశజునకు నివేదించిరి.

తే రాజవచనాద్దూతా రాజవేశ్మ ప్రవేశితాః |
దదృశుర్దేవ సంకాశం వృద్ధం దశరథం నృపమ్ ||

స|| రాజవచనాత్ తే దూతాః రాజవేశ్మ ప్రవేశితాః దేవసంకాశం వృద్ధం దశరథం నృపమ్ దదృశుః ||

తా|| రాజుగారి మాటతో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించి దేవతలతో సమానుడైన వృద్ధుడైన దశరథ మహారాజు ని చూచితిరి.

బద్ధాంజలి పుటాస్సర్వే దూతా విగతసాధ్వసాః |
రాజానం ప్రయతా వాక్యం అబ్రువన్ మధురాక్షరమ్ ||

స|| దూతాః విగతసాధ్వసాః సర్వే బద్ధాంజలి పుటాః రాజానం ప్రయతా మధురాక్షరం వాక్యం అబ్రువన్ ||

తా|| దూతలు ప్రశాంతమైన మనస్సు తో అందరికి అంజలి ఘటించి రాజుతో నియమపూర్వకముగా మధురమైన మాటలతో ఇట్లు పలికిరి.

మైథిలో జనకోరాజా సాగ్నిహోత్ర పురస్కృతమ్ |
కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయపురోహితమ్ ||

స|| మైథిలః జనకః స అగ్నిహోత్ర పురస్కృతమ్ రాజా స ఉపాధ్యాయ పురోహితం అవ్యయం కుశలం చ ( అబ్రువన్) ||

తా|| "మిథిలాధిపతి అగు జనకుడు అగ్నిహోత్ర నిరతుడగు ఉపాధ్యాయ పురోహితులతో కూడిన రాజు గారి కుశలము (అడుగుచున్నారు)".

ముహుర్ముహుర్మధురయా స్నేహ సంయుక్తయా గిరా |
జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే సపురస్సరమ్ ||

స|| హే మహరాజ మధురయా స్నేహ సంయుక్తయా ముహుః ముహుః మహారాజ జనకః త్వాం సపురస్సరమ్ పృచ్ఛతే ||

తా|| "ఓ మహారాజా !మధురముగా స్నేహపూర్వకముగా జనకుడు మరల మరల మీ క్షేమము అడుగుచున్నారు".

పృష్ట్వా కుశల మవ్యగ్రం వైదేహో మిథిలాధిపః |
కౌశికానుమతే వాక్యం భవంతం ఇదమబ్రవీత్ ||

స|| మిథిలాధిపః వైదేహః అవ్యగ్రం కుశలం పృష్ట్వా కౌశికస్య అనుమతే ఇదం వాక్యం భవంతం అబ్రవీత్ ||

తా|| "మిథిలాధిపతి అగు జనకుడు మీ కుశలములు అడిగి కౌశికుని అనుమతితో ఈ మాటలు మీకు చెప్పుచున్నారు".

పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా |
రాజానశ్చ కృతామర్షాః నిర్వీర్యా విముఖీకృతాః ||

స|| పూర్వం మమాత్మజా వీర్యశుల్కా (ఇతి) ప్రతిజ్ఞా ( తే ) విదితా | రాజానః కృతమర్షాః నిర్వీర్యా విముఖీకృతాః (ఇతి తే విదితా) ||

తా||’ ఫూర్వము మా కుమార్తె వీర్య శుల్కమని ప్రతిజ్ఞచేసినది విదితమే అగును. అనేకమంది రాజులు విఫలురై తిరుగుపొయినది మీకు విదితమ”.

సేయం మమసుతా రాజన్ విశ్వామిత్రపురస్సరైః |
యదృచ్ఛయా గతై ర్వీరైః నిర్జితా తవ పుత్త్రకైః ||

స|| హే రాజన్ ! యదృచ్ఛయా విశ్వామిత్రపురస్సరైః గతైః వీరైః తవపుత్రకైః స అయం మమసుతా నిర్జితా ||

తా|| ’ఓ రాజన్ ! భాగ్యవశమున విశ్వామిత్రునితో కలిసి వచ్చిన వీరులు నీ పుత్రులు నా కుమార్తెను గెలుచుకున్నార”.

తచ్ఛ రాజన్ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా |
రామేణ హి మహారాజ మహత్యాం జనసంపది ||

స|| హే రాజన్ ! మహత్యాం జనసంపది తత్ దివ్యం ధనుః మహాత్మనా రామేణ మధ్యే భగ్నం చ హి ||

తా|| ’ఓ రాజన్ ! మహత్తరమైన జనసంపది లో ఆ దివ్యమైన ధనస్సు మధ్యలో మహాత్ముడగు రామునిచే భగ్నము చేయబడెన”.

అస్మై దేయా మయా సీతా వీర్య శుల్కా మహాత్మనే|
ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతు మర్హసి ||

స|| అస్మై మహాత్మనే వీర్యశుల్కా సీతా దేయా ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి | తత్ అనుజ్ఞాతు మర్హసి ||

తా|| ’అందువలన వీర్యశుల్కమైన సీతను ఇచ్చెదను అన్న ప్రతిజ్ఞ పాటింప దలిచితిని . దానికి మీ అనుమతి కొఱకు ప్రార్థించుచున్నాన”.

సోపాధ్యాయో మహారాజ పురోహితపురస్సరః |
శీఘ్ర మాఅగచ్ఛ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ ||

స|| భద్రం తే | హే మహారాజ స ఉపాధ్యాయ పురోహిత పురస్సరః శీఘ్రం ఆగచ్ఛ | రాఘవౌ ద్రష్టుమర్హసి ||

తా|| ’మీకు శుభమగుగాక . ఓ మహరాజా ! మీ ఉపాధ్యాయులు పురోహితులతో సహ శీఘ్రముగా రండు. రామ లక్ష్మణులను కూడా చూడవచ్చున”.

ప్రీతిం చ మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి |
పుత్త్రయో రుభయో రేవ ప్రీతిం త్వమపి లప్స్యసే ||

స|| హే రాజేంద్ర ! మమ ప్రీతించ నిర్వతయితుమర్హసి | ఉభయోః పుత్రయోః ప్రీతిం ఏవ త్వం అపి లప్స్యసే ||

తా|| ’ఓ రాజేంద్ర ! మా కోరికను మన్నించతగును. ఇద్దరు పుత్రుల ఆనందములో కూడా నీవు పాల్గొనవచ్చు’.

ఏవం విదేహపతిః మధురం వాక్యమబ్రవీత్ |
విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః శతానంద మతే స్థితః ||

స|| ఏవం విశ్వామిత్ర అభ్యనుజ్ఞాతః శతానన్ద మతే స్థితః విదేహపతిః మధురం వాక్యం అబ్రవీత్ ||

తా|| ఈ విధముగా విశ్వామిత్రుని అనుమతి తో శతానందుని సూచనను అనుసరించి జనకుడు ఇట్లు మథురమగు వాక్యములతో పలికెను.

దూతవాక్యం తు తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షితః |
వసిష్ఠం వామదేవం చ మంత్రిణో sన్యాంశ్చ సోs బ్రవీత్ ||

స|| తత్ దూతవాక్యం శ్రుత్వా రాజా పరమ హర్షితః ( అభవత్) | సః వసిష్టం వామదేవం చ మంత్రిణో అన్యాం చ అబ్రవీత్ ||

తా|| ఆట్లు దూత వాక్యములను విని రాజు పరమ ఆనంద పడెను. అతడు వసిష్టుడు వామదేవుడు ఇతర మంత్రులతో ఇట్లు పలికెను.

గుప్తః కుశికపుత్రేణ కౌశల్యానందవర్ధనః |
లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ ||

స|| కౌసల్యానన్దవర్ధనః భ్రాతా లక్ష్మణేన సహ కుశికపుత్రేణ గుప్తః | విదేహేషు వసత్యసౌ ||

తా|| కౌసల్య తనయుడు , తమ్ముడగు లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుని రక్షణలో వున్నారు. విదేహ రాజ్యములో ఉన్నారు.

దృష్టవీర్యస్తు కాకుత్‍స్థో జనకేన మహాత్మనా |
సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్ఛతి ||

స|| మహాత్మనా జనకేన కాకుత్‍స్థౌ దృష్ట వీర్యస్తు సుతాయాః రాఘవే సంప్రదానం కర్తుమిచ్ఛతి ||

తా|| మహాత్ముడగు జనకుని చేత కాకుత్‍స్థుల వీర్యము చూసి తన కుమార్తెను రాఘవునకు ఇచ్చుటకు కోరుచున్నాడు.

యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః |
పురీం గచ్ఛామహే శీఘ్రం మాభూత్ కాలస్య పర్యయః ||

స|| యది వో జనకస్య వృత్తం రోచతే శీఘ్రం మహాత్మనః పురీం గచ్ఛామహే | కాలస్య పర్యయః మాభూత్ ||

తా|| జనకుని వృత్తాంతము మీకు సమ్మతమైనచో ఆ మహాత్ముని నగరము వెళ్ళూదము. కాలము వృథా చేయవలదు.

మంత్రిణో భాఢమిత్యాహుః సహ సర్వైర్మహర్షిభిః |
సుప్రీతశ్చాబ్రవీ ద్రాజా శ్వో యాత్రేతి స మంత్రిణః ||

స|| సర్వైః మహర్షిభిః మంత్రిణః సహ భాఢం ఇతి ఆహుః | సుప్రీతః శ్వో సమంత్రిణః యాత్రేతి రాజా అబ్రవీత్ ||

తా|| అందరు మహర్షులు , మంత్రులు తో కలిసి బాగు బాగు అని పలికిరి |రాజు సంతోషముతో మరుదినమే మంత్రులతో ప్రయాణమని చెప్పెను.

మంత్రిణస్తాం నరేంద్రస్య రాత్రిం పరమ సత్కృతాః |
ఊషుస్తే ముదితాస్సర్వే గుణైస్సర్వై స్సమన్వితాః ||

స||నరేంద్రస్య తాం మంత్రిణః పరమ సత్కృతాః సర్వై గుణైః సమన్వితాః ముదితాః రాత్రిం ఊషుస్తే ||

తా|| ఆ నరేంద్రుని మంత్రులు సకల గుణ సమన్వితులు , రాజుచే మెప్పుపొందినవారు . వారు సంతోషముతో రాత్రి గడిపిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలాకాండే అష్టషష్టితమస్సర్గః ||
సమాప్తం ||

ఈవిధముగా బాలాకాందలోని అరువది ఎన్మిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||